కరకగూడెం మండలంలో ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్ సమావేశం ప్రారంభం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని అనంతారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్ సమావేశం మొదటి రోజు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి కాంప్లెక్స్ ఉపాధ్యాయులు ఎల్. కరణ్ అధ్యక్షత వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, “డిజిటల్ లిటరసీ ప్రస్తుత యుగంలో ప్రతి ఒక్కరు అవగాహన పొందవలసిన అత్యంత ప్రాధాన్యత గల అంశం” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్‌లుగా ఉపాధ్యాయులు జె. వెంకటేశ్వర్లు, పి. రఘుబాబు, ఎం. తిరుమలరావు మరియు సి.ఆర్.పి. విష్ణుమూర్తి పాల్గొని ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం అందించారు.
Post Views: 27









