ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఆదివాసీ జేఏసీ ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఆదివాసీ జేఏసీ ఆందోళన
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన కార్యక్రమం జరిగింది. మండలంలోని భట్టుపల్లి సెంటర్ వద్ద ఉన్న కొమరం భీమ్ విగ్రహానికి ఆదివాసీ నాయకులు పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. అనంతరం సుప్రీంకోర్టులో కేసు వేసిన తెల్ల వెంకటరావు, సోయం బాపురావు ఫోటోలకు పాలాభిషేకం చేశారు.

జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా ఆయన వాహనాన్ని ఆపి, లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. అనంతరం బైక్ ర్యాలీ రూపంలో కరకగూడెం మండల కేంద్రానికి చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ ఆదివాసీలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు.

తరువాత తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న జేఏసీ నాయకులు తహసీల్దార్‌కి కూడా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఎలాంటి వెనుకడుగు వేయబోమని, లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తప్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వానికి హెచ్చరిక
జేఏసీ నాయకులు ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేస్తూ—
➡️ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి వెంటనే తొలగించకపోతే ఉద్యమాన్ని జిల్లా నుండి రాష్ట్రస్థాయి వరకు ఉధృతం చేస్తామని,
➡️ రోడ్లపైకి దిగి భారీ ర్యాలీలు, ఆందోళనలు చేపడతామని,
➡️ మరింత తీవ్ర పోరాటానికి సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల జేఏసీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో ఆదివాసీ సమాజం పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….