ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని రేగా కాంతారావు పిలుపు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని రేగా కాంతారావు పిలుపు

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని, సెప్టెంబర్ 10, 11 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

గురువారం కరకగూడెం మండలంలోని స్పందన గార్డెన్‌లో కరకగూడెం, ఆళ్లపల్లి, గుండాల మూడు మండలాల బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేగా కాంతారావు మాట్లాడుతూ… ఆరు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను అభివృద్ధి కార్యక్రమాలు గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇల్లు పేర్లతో ప్రజలను ఆశపెడుతున్నారని, ఇలాంటి నాటకాలపై నమ్మకం పెట్టుకోవద్దని పిలుపునిచ్చారు.

రైతుల పండించే పంటలకు సకాలంలో ఎరువులు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులను కళ్లల్లో పెట్టి చూసుకున్నారని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ తమ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిపించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని రేగా కాంతారావు పిలుపునిచ్చారు.

అనంతరం కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీని వీడి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసిలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….