ప్రజల సౌకర్యార్థం భూసమస్యల పరిష్కారానికి భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
ఆధాబ్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచనలు జారీ చేశారు. భూసమస్యల పరిష్కారార్థం జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి ప్రజలు సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి రావడం వల్ల కలిగే అసౌకర్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించవచ్చు.
కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఆధ్వర్యంలో జరిగే ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించవచ్చు.
జిల్లా ప్రజలు తమ నియోజకవర్గాల వారీగా సంబంధిత కార్యాలయాలను సంప్రదించి, భూసమస్యల పరిష్కారానికి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.









