ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  రైతులందరికీ సరిపడా యూరియా సరఫరా చేయాలి – పినపాకలో సిపిఐ ధర్నా

రైతులందరికీ సరిపడా యూరియా సరఫరా చేయాలి – పినపాకలో సిపిఐ ధర్నా

పినపాక ,ఆధాబ్ న్యూస్:
రైతులకు సరిపడా యూరియాను తక్షణమే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం పినపాక మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు.

మిర్చి, వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు వంటి పంటలకు యూరియా సరఫరా సకాలంలో లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు చేసి సాగు ప్రారంభించిన రైతులకు యూరియా అందకపోవడం వల్ల దిగుబడి తగ్గి, భారీ స్థాయిలో నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని వారు తెలిపారు.

రాష్ట్రానికి 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందని విమర్శించారు. దీంతో రాష్ట్రంలో యూరియా కొరత ప్రమాదకర స్థాయికి చేరిందని పేర్కొన్నారు.

యూరియా పంపిణీలో అవినీతి, దళారీ వ్యవస్థను అరికట్టి ప్రతి రైతుకు సమానంగా ఎరువులు చేరేలా చూడాలని, పూర్తి సబ్సిడీతో ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాలు అందించాలని ఏఐకెఎస్ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు వినతిపత్రం అందజేశామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గడ్డం మనోహర చారి, తోగటి కుమార్, పత్తిపాటి నాగేశ్వరరావు, పద్మనాభ రాజు, గడ్డం వెంకటాచారి, మన్యం ఐలయ్య, వర్స నరసింహారావు, గురజాల సుబ్రహ్మణ్యం, రమణాచారి, తంగేళ్లపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….