ఏపీలో పండుగ పూట విషాదం.. కరెంట్ షాక్‌తో యువకుడు మృతి, ఐదుగురికి గాయాలు
ఏపీ,ఆధాబ్ న్యూస్:
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలో పండుగ రోజు దుర్ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో లైటింగ్ కోసం స్తంభం ఏర్పాటు చేసే క్రమంలో కరెంట్ షాక్ తగలడంతో చరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనుకోని ఈ విషాద ఘటనతో పండుగ వాతావరణం కన్నీటి వాతావరణంగా మారిపోయింది. గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.
Post Views: 49









