అశ్వాపురంలో ఆర్టీవో ఆకస్మిక తనిఖీలు
అశ్వాపురం,ఆధాబ్ న్యూస్:
అశ్వాపురం మండల కేంద్రానికి సమీపంలోని గొల్లగూడెం బ్రిడ్జి వద్ద ఆర్టీవో పరుక్ ఆకస్మికంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా టాక్సీలను పరిశీలించారు. వాహనదారులు సమయానికి తమ వాహనాలకు టాక్స్ చెల్లించాలని, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా వాహనాలు నడపడం నేరమని ఆయన హెచ్చరించారు.
డ్రైవర్లు తప్పనిసరిగా సీటు బెల్టులు, హెల్మెట్లు వాడాలని, డ్రైవింగ్ సమయంలో లైసెన్స్, వాహన పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. అలాగే వాహనం నడుపుతూ సెల్‌ఫోన్లు ఉపయోగించరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలన్నారు.
Post Views: 71









