పినపాక మండలంలో సీసీ రోడ్లకు శుభారంభం
పినపాక,ఆధాబ్ న్యూస్:
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పినపాక మండలంలోని పోట్లపల్లి, మల్లారం పంచాయితీలలో పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ పనులకు సుమారు ₹60 లక్షల అంచనా వ్యయం కేటాయించారు. గ్రామాల్లో రహదారి సదుపాయాలు మెరుగుపడితే ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రజల అభ్యర్థన మేరకు ప్రభుత్వం తరఫున అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ప్రతి గ్రామానికి తగిన సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Post Views: 39









