ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద రోడ్డు డైవర్షన్ పాయింట్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

 

దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద రోడ్డు డైవర్షన్ పాయింట్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలి : కలెక్టర్ జితేష్ వి. పాటిల్

అత్యవసరమైతే వెంటనే 100కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచించారు.

జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా అధికారులు ఇచ్చే సూచనలకు సహకరించాలని ఆయన కోరారు.

పోలీస్ శాఖ కూడా ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ లోతట్టు ప్రాంత ప్రజలకు అండగా ఉంటుందని ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100కు కాల్ చేయాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎస్పీ  దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద రహదారిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పాయింట్‌ను తనిఖీ చేసి, గోదావరి ఉధృతి పెరిగిన పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం భద్రాచలం కరకట్ట వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు.

పట్టణ వాసులు మరియు లోతట్టు ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అక్కడ విధుల్లో ఉన్న NDRF, DDRF బృందాలకు కూడా పలు సూచనలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….