ప్రతి క్షణం
ప్రజల పక్షం

  బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసిన జిల్లా, మండల అధ్యక్షులు

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసిన జిల్లా, మండల అధ్యక్షులు

హైదరాబాద్‌,ఆధాబ్ న్యూస్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్‌రెడ్డి కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, పార్టీ బలోపేతం అంశాలపై చర్చించారు. పార్టీలో యువ నాయకత్వాన్ని పెంపొందించాలని కేటీఆర్ సూచించారు.

పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని మండల అధ్యక్షుడు పగడాల సతీష్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్