వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఏసీబీ దాడులు – లంచం తీసుకుంటుండగా మహిళా ఉద్యోగి అరెస్ట్
వికారాబాద్,ఆధాబ్ న్యూస్:
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. రెవిన్యూ సెక్షన్లో పనిచేస్తున్న సుజాత అనే మహిళా ఉద్యోగిని, లంచం తీసుకుంటుండగా రంగేహస్తంగా పట్టుకున్నారు.
నవాబుపేట మండలం తహసీల్దార్ కార్యాలయానికి ప్రొసీడింగ్ కాపీ పంపించడానికి ₹15,000 లంచం డిమాండ్ చేసిన సుజాత, ఈ మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు.
ఈ విషయాన్ని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు వివరించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది
Post Views: 45









