ప్రతి క్షణం
ప్రజల పక్షం

  చిరుమల్ల గ్రామంలో మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు

చిరుమల్ల గ్రామంలో మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా పరంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. కరకగూడెం మండలంలోని చిరుమల్ల గ్రామ పరిధిలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి, వారి వద్ద ఉన్న లగేజీ బ్యాగులు, వాహనాలు, గుర్తింపు కార్డులను సైతం పోలీసులు జాగ్రత్తగా పరిశీలించారు. గ్రామ సరిహద్దుల్లో వాహనాల రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ తనిఖీల్లో ఏడుల్లబయ్యారం సీఐ వి. వెంకటేశ్వర రావు, కరకగూడెం ఎస్ఐ పివిఎన్ రావు, టీజీఎస్పీ (తెలంగాణ గిరిజన ప్రత్యేక పోలీసు) స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనపడినచో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్