మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు విడుదల
ములుగు ,ఆధాబ్ న్యూస్:
ములుగు జిల్లా మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే నాలుగు సూట్ల గెస్ట్ హౌస్కు ఆర్ అండ్ బీ శాఖ అనుమతులు ఇచ్చింది. మంత్రి సీతక్క ప్రయత్నాలు ఫలించాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కొరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఇప్పటికే వారికి సౌకర్యాలు కల్పించేందుకు నిధులు కేటాయించినట్టు మంత్రి తెలిపారు.
Post Views: 32









