భద్రాద్రిలో సమీక్షా సమావేశం – మంత్రులతో పాటు టిపిసిసి ప్రధాన కార్యదర్శి నాగాసీతారాములు హాజరు
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాస్థాయి సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించబడింది.
ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా ఇంచార్జ్ వాకటి శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు.
వీరితో పాటు టిపిసిసి ప్రధాన కార్యదర్శి నాగాసీతారాములు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ:
సీజనల్ వ్యాధుల నియంత్రణ,
గోదావరి వరదలపై జాగ్రత్తలు,
యంగ్ ఇండియా స్కూల్స్ అభివృద్ధి,
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
తదితర ప్రజావాసర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.









