ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం – రేగళ్ల గుత్తి కోయ గ్రామంలో పోలీసుల సేవా కార్యక్రమం

కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం – రేగళ్ల గుత్తి కోయ గ్రామంలో పోలీసుల సేవా కార్యక్రమం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని రేగళ్ల గుత్తి కోయ గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా ఓఎస్డీ నరేందర్, మణుగూరు డీఎస్పీ రవీంద్రరెడ్డి, ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు, పోలీసులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలోని చిన్నారులకు నోట్‌బుక్స్, పలకలు, బలపాలు అందజేశారు. యువతకు వాలీబాల్ కిట్లు, బాల్స్ పంపిణీ చేశారు. అలాగే పొలం పనులు చేసే సమయంలో వర్షం వల్ల ఇబ్బంది లేకుండా 100 ప్లాస్టిక్ కవర్లు అందజేశారు.

ఈ కార్యక్రమం గ్రామస్తుల హృదయాలను గెలుచుకుంటూ, పోలీసులపై విశ్వాసాన్ని పెంచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్