ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

*సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి*

 

 

సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు…

 

20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు..

 

రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన..

 

గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్..

 

సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

 

 

కరకగూడెం,ఆధాబ్ న్యూస్ ఆగస్టు 20:

 

కరకగూడెం మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో ఉన్నటువంటి సారలమ్మ గుడికి కనీస మౌలిక వసతులు లేక భక్తులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ అన్నారు. ప్రధాన రహదారి నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న సారలమ్మ ఆలయానికి వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో భక్తులు గుడికి ఎలా చేరుకోవాలో అయోమయానికి గురవుతున్నారని తెలిపారు.

సారలమ్మ ఆలయం కరకగూడెం మండలంలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. వారానికి రెండు రోజులు ఆలయం తెరిచి ఉండగా, ఒక్కోసారి భక్తులు రద్దిగా ఉండడం వలన ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే ఆలయానికి సరైన రోడ్డు, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ భక్తుల ఆవేదన..

 

*గత కొన్ని ఏళ్లుగా సౌకర్యాలు లేకుండా ఆలయం ప్రాంగణం*..

 

ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు లేకపోవడం బాధాకరమని గోగ్గల కృష్ణ పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యను పట్టించుకోకపోవడం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు రహదారి సౌకర్యం ఉండేదని, ప్రస్తుతం ఆ మార్గం సరిగా లేకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఆలయం చుట్టుపక్కల వ్యవసాయ భూములు ఉండటంతో రైతులు కూడా రాకపోకల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, భక్తులు నడిచి వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ప్రధాన రహదారి నుంచి సారలమ్మ గుడి వరకు రహదారిని నిర్మించడంతో పాటు ఆలయానికి విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ కోరారు. ఆలయానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి ఇబ్బందులను తొలగించాలని పూజారి పోలేపోయిన నరసయ్య కూడా కోరారు. అధికారులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….