బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు
కరకగూడెం, ఆగస్టు 20 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం మండలం అనంతారం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన బీట్ ఆఫీసర్ పాయం రాజాబాబు తండ్రి బుచ్చయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం బుచ్చయ్య మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం దశదినకర్మ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ నాయకులు బుచ్చయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, ఆళ్లపల్లి మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు, మండల నాయకులు బుడగం రాము, బైరిశెట్టి చిరంజీవి, ఊకే రామానాథం, అత్తె సత్యనారాయణ, పసునూరి అంజయ్య, గొగ్గల నరసయ్య, బత్తిని సీత్తయ్య, నిట్టా ఏడుకొండలు, తోలెం సారయ్యతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.








