జన్నారం,ఆధాబ్ న్యూస్ :
జన్నారం మండలం లింగాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఏసీబీ అధికారులకు చిక్కినట్లు సమాచారం. గ్రామంలో ఓ ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో రూ.13 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఆమెపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.
పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడిన ఘటనతో జన్నారం మండలంలో కలకలం రేగింది.
Post Views: 9








