ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద

విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి

ఆధాబ్ న్యూస్ , కరకగూడెం, ఆగస్టు 23:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్‌లో కోతుల బెడదతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొంతకాలంగా హాస్టల్ పరిసరాల్లో కోతులు సంచరిస్తూ విద్యార్థులను భయపెట్టడంతో పాటు, హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థులను గీకుతున్న ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోతులు హాస్టల్‌లోకి ప్రవేశిస్తుండటంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొంది. చిన్నారులు భయంతో గదుల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిబ్బంది తెలిపారు. కోతుల దాడులతో విద్యార్థులకు గాయాలయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బయ్యారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ) ప్రత్యేక చొరవ తీసుకుని కేజీబీవీ హాస్టల్‌ను సందర్శించి పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది కోరుతున్నారు. కోతులకు ఎలాంటి హాని కలగకుండా అటవీశాఖ నిబంధనల ప్రకారం వాటిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలోకి తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అలాగే భవిష్యత్తులో కోతులు హాస్టల్‌లోకి ప్రవేశించకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

“మా హాస్టల్‌కు వచ్చి పరిస్థితిని స్వయంగా పరిశీలించి, మా భద్రత కోసం కోతులను సురక్షితంగా అడవిలోకి తరలించే చర్యలు తీసుకోవాలి” అని విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి హాస్టల్‌ను సందర్శించి కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….