మణుగూరులో ఫారెస్ట్ అధికారులతో ఎమ్మెల్యే పాయం ప్రత్యేక సమావేశం
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
మణుగూరు డివిజన్‌లోని అన్ని మండలాల అటవీ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఇటీవల చోటుచేసుకున్న ఇరవెండి ఘటనపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న రైతులను ఇబ్బంది పెట్టకూడదు. ప్రభుత్వం పరువు పోయేలా వ్యవహరించకండి,” అని అటవీ అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, శాంతియుత పరిష్కార మార్గాలను అన్వేషించాలని ఆయన కోరారు.
Post Views: 35









