సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీసీహెచ్‌వో రవిబాబు
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
సీజన్ వ్యాధుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (డీసీహెచ్‌వో) రవిబాబు సూచించారు.
సోమవారం ఆయన మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి, ఆసుపత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిని మర్యాదపూర్వకంగా ఆత్మీయతతో ఆదరించాలి,” అని సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మార్తి సాయి మోహన్ యాదవ్‌ను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంవో)గా నియమిస్తూ నియామక పత్రాన్ని డీసీహెచ్‌వో రవిబాబు అందజేశారు.
ఆర్ఎంవోగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సాయి మోహన్‌కు వైద్యులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 49









