ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఓసి గనుల వల్ల గ్రామస్తుల ఇళ్లకు బీటలు – దుమ్ము ధూళితో వ్యాధులు

ఓసి గనుల వల్ల గ్రామస్తుల ఇళ్లకు బీటలు – దుమ్ము ధూళితో వ్యాధులు
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
మణుగూరు మండలంలోని రాజుపేట, విఠల్ రావు నగర్, పీకే వన్ సెంటర్ గ్రామాల ప్రజలు సోమవారం ఉదయం సింగరేణి ఓపెన్‌కాస్ట్ (ఓసి) గనుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై ఆందోళన చేపట్టారు.

బ్లాస్టింగ్ కారణంగా ఇళ్లకు బీటలు విరగడంతో పాటు గాలిలో కలిసిన దుమ్ము ధూళి వలన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నామని గ్రామస్తులు వాపోయారు.

ఈ నేపథ్యంలో గ్రామస్తులు ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలను లిఖిత పూర్వకంగా తెలియజేస్తూ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!