అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మణుగూరులో అవగాహన కార్యక్రమం
మణుగూరు, ఆధాబ్ న్యూస్: అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 20 నుండి 26 వరకు నిర్వహిస్తున్న అవగాహన వారోత్సవాల భాగంగా, మణుగూరు పోలీసుల ఆధ్వర్యంలో జెడ్‌పిహెచ్‌ఎస్ సమితి సింగారం పాఠశాలలో అవగాహన కార్యక్రమం మరియు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, “భవిష్యత్తు నిర్మాణం విద్యార్థుల చేతుల్లోనే ఉంది. మీరు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. క్రమశిక్షణతో చదువుకొని మంచి పౌరులుగా ఎదగాలి,” అని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మణుగూరు ఇన్‌చార్జ్ ఆఫ్ పోలీస్ నాగబాబు , ఎస్‌ఐ ప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ విధంగా మాదకద్రవ్యాల హానికర ప్రభావాలపై అవగాహన పెంచడం, పర్యావరణ పరిరక్షణకు సూచనలివ్వడం ద్వార మణుగూరు పోలీసులు మంచి సానుకూల సంకేతాన్ని ప్రజలకు అందించారు.









