ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం మండలంలో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు – జూన్ 23న గ్రామ పంచాయతీల వద్ద వినతిపత్రాల అందజేత. మండల అధ్యక్షుడు రావుల సోమయ్య

కరకగూడెం మండలంలో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు – జూన్ 23న గ్రామ పంచాయతీల వద్ద వినతిపత్రాల అందజేత. మండల అధ్యక్షుడు రావుల సోమయ్య

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల ప్రకారం, కరకగూడెం మండలంలో జూన్ 23, సోమవారం నాడు విస్తృత స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుల నేతృత్వంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, సోషల్ మీడియా వారియర్స్, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొనబోతున్నారని తెలిపారు.

నిరసన కార్యక్రమాల్లో ప్రస్తావించబోయే ప్రధాన అంశాలు ఇవే:

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు అయినా నిలిచిపోయిన అభివృద్ధి పనులు

గ్రామాల్లో ప్రస్తుతం చేయవలసిన అభివృద్ధి పనులపై అవగాహన

ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు

ఈ అంశాలపై గ్రామస్థాయి ప్రజలతో చర్చించి, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతూ, పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో విజయవంతంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ మండల నాయకత్వం శ్రద్ధ తీసుకుంటోందని సోమయ్య తెలిపారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!