ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులను ఖండించిన రైతు సంఘం నేతలు

భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసి పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు, దౌర్జన్యాలు తీవ్రంగా పెరుగుతున్నాయని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి డి. పున్నంచంద్, జిల్లా నాయకుడు కుంజా వెంకటేశ్వర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం బూర్గంపాడు మండలంలో జరిగిన అత్యవసర సమావేశంలో వారు మాట్లాడుతూ — బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలోని ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు అక్రమంగా దాడులకు దిగుతున్న ఘటనలను ఖండిస్తున్నామని తెలిపారు. పోడు భూములు బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని, ప్రభుత్వం తక్షణమే దీనిపై జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చి కొన్ని ఇవ్వడం, మరికొన్ని పెండింగ్‌లో పెట్టడం వల్ల ఆదివాసీల నమ్మకాన్ని దెబ్బతీసిందని, అదే కారణంగా ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా పరిస్థితులు మారలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం చివరి ఎకరం వరకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ, తిరిగి ప్రజలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రజలే తమపై దాడి చేసినట్లు కేసులు నమోదు చేయడం అనేది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, దీనిని అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి తోలేం మమత, అధ్యక్షురాలు కుంజ సోమక్క, సహాయ కార్యదర్శి సొందీ గోపమ్మ, రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం నరసింహారావు, నాయకులు సోడె రామకృష్ణ, పూజిత, శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….