ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కోట్ల మార్క్ దాటిన లబ్ధిదారులు రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం

3 కోట్ల మార్క్ దాటిన లబ్ధిదారులు రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం
హైద్రాబాద్, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 3 కోట్లను అధిగమించింది. ఇది రాష్ట్రంలోని ఆహార భద్రత పథకానికి మరింత బలాన్నిచ్చే విషయం అని అధికారులు తెలిపారు.

ఇకపోతే, ప్రభుత్వం నాలుగు విడతల్లో 2.03 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. త్వరలో ఈ కొత్త కార్డులను మంత్రులు మరియు ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని యోచనలో ఉంది.

ఈ చర్యల ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు మరింత సులభంగా అందుబాటులోకి రానుండగా, ఆహార భద్రత పథకం కింద మరిన్ని కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్