ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  తలసీమియా పిల్లల కోసం మెగా రక్తదాన శిబిరం – “అమ్మ జన్మనిస్తుంది, రక్తదానం పునర్జన్మనిస్తుంది”: కొప్పుల మురళి

తలసీమియా పిల్లల కోసం మెగా రక్తదాన శిబిరం – “అమ్మ జన్మనిస్తుంది, రక్తదానం పునర్జన్మనిస్తుంది”: కొప్పుల మురళి

పాండురంగాపురం, ఆధాబ్ న్యూస్:
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పాండురంగాపురం, వెంకట్రావుపేట, చింతలబయ్యారం, మద్దెలగూడెం, చిన్నరాజుపేట, సింగిరెడ్డిపల్లి, మల్లారం, అమరవరం గ్రామాల యువత మరియు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో తలసీమియా, సికిల్ సెల్ అనీమియా వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ కొప్పుల మురళి మాట్లాడుతూ, “అమ్మ జీవితం ఇస్తుంది, రక్తదాత ప్రాణాన్ని కాపాడతాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం పునర్జన్మను ప్రసాదిస్తుంది,” అని అన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో తలసీమియా, సికిల్ సెల్ అనీమియా బాధితుల సంఖ్య పెరుగుతోందని, ఈ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు తరచూ రక్తం అవసరమవుతుందని తెలిపారు. “చిరునరులకు నెలకు ఒకసారి లేదా 15 రోజులకు ఒక్కసారి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంది. సరైన సమయంలో రక్తం అందక ఇబ్బంది పడుతున్నారు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రక్తదాన శిబిరంలో 40 మంది రక్తదానం చేశారని, అడగగానే స్పందించి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని మురళి కోరారు.

శిబిరంలో రక్తదానం చేసిన దాతలకు ప్రశంసాపత్రాలు, షీల్డ్‌లు అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు ఆదినారాయణ, లక్ష్మణ్, శ్రీకాంత్, సంతోష్, కిషోర్, రమేష్, మహేష్, అనిల్, రామకృష్ణ, ప్రమోద్, నాగరాజు, జంపయ్య, సాయి రాజు, సాయిదీప్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….