ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వి.ఎం. బంజరలో ఘోర రోడ్డు ప్రమాదం – మహిళా పంచాయతీ కార్యదర్శి మృతి

వి.ఎం. బంజరలో ఘోర రోడ్డు ప్రమాదం – మహిళా పంచాయతీ కార్యదర్శి మృతి

పెనుబల్లి,ఆధాబ్ న్యూస్:
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని వి.ఎం. బంజర వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళా పంచాయతీ కార్యదర్శి బానోత్ సోనాలి (28) మృతిచెందింది.

సోనాలి, రామచంద్రరావు బంజర గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తూ, విధులకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఘటనాస్థలంలోనే ఆమె మరణించింది.

ఈ వార్త స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. సోనాలి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్