ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అశ్వాపురంలో సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

అశ్వాపురంలో సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
అశ్వాపురం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో గత BRS ప్రభుత్వ హయాంలో మంజూరైన సుమారు రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ మరియు డివైడర్ పనులను BRS జిల్లా అధ్యక్షుడు, మాజీ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి పనుల్లో నాణ్యమైన వస్తువులు, పరికరాలు వినియోగించాలి అంటూ అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా పనులు ఉండాలన్నారు. పని నాణ్యతపై ఏ రకమైన రాజీ లేదని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:

అశ్వాపురం మండల BRS అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్

మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి

మాజీ వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం

పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి

జాలే రామకృష్ణారెడ్డి, ఈదర సత్యనారాయణ, కుర్రి నాగేశ్వరరావు, నూకరపు రమేష్, ముద్దందుల కృష్ణ, చిలక వెంకటరమయ్య, చుంచు రామ్మూర్తి, ఎం.వెంకటేశ్వర్లు

మండల యువజన అధ్యక్షుడు గద్దాల రామకృష్ణ

బూర్గంపాడు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుంపేనా శ్రీను

తూము చిన్న రాఘవులు, చావా వీర రాఘవులు, దావా వీరస్వామి, శివారపు డాక్టర్ బాబు

మండల సోషల్ మీడియా అధ్యక్షుడు గజ్జి లోహిత్ యాదవ్, శేఖర్, అశోక్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!