గురుకుల పాఠశాల ప్రాంగణంలో శ్రమదానం చేసిన మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి
పాల్వంచ,ఆధాబ్ న్యూస్: కిన్నెరసాని వద్ద గల గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో శనివారం ఉదయం శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఇందులో చురుకుగా పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధులతో కలిసి పాఠశాల ఆవరణలోని పిచ్చిమొక్కలు తొలగించి, చెత్తను ఎత్తివేశారు. పరిసరాలను శుభ్రంగా మారుస్తూ స్వచ్ఛతకు ప్రాధాన్యతనిచ్చారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచందర్ నాయక్, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో భాగంగా దృఢ సంకల్పంతో నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు.









