ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  చనువిచ్చింది కదా? అని పులితో ఆడుకుంటే వేటాడేస్తది! థాయిలాండ్‌లో రీల్స్ కోసం అతి చేసిన యువకుడిపై పులి దాడి – గాయాలతో బయటపడిన వ్యక్తి

చనువిచ్చింది కదా? అని పులితో ఆడుకుంటే వేటాడేస్తది!
థాయిలాండ్‌లో రీల్స్ కోసం అతి చేసిన యువకుడిపై పులి దాడి – గాయాలతో బయటపడిన వ్యక్తి

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
పులి చనువిచ్చింది కదా అని అతి చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియా ప్రభావంతో వన్యప్రాణులతో ఫోటోలు, రీల్స్ తీసుకోవడం ట్రెండ్‌గా మారింది. కానీ, అది ఎప్పుడైనా ప్రాణాలకు ప్రమాదకరంగా మారవచ్చు. తాజా ఘటన థాయిలాండ్‌లోని ఓ జూ పార్కులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, ఓ యువకుడు పెద్దపులితో కలిసి రీల్ తీయాలని ప్రయత్నించాడు. చైన్‌తో పులిని పట్టుకుని నడుస్తూ వచ్చాడు. ఆపై దాని పక్కన కూర్చున్నాడు. ఇంతవరకూ అందరూ బాగానే ఉందని భావించారు. కానీ, అకస్మాత్తుగా జూపార్క్ సిబ్బందిలోని మరో వ్యక్తి పులిని కర్రతో కొట్టడంతో, అది ఆగ్రహంతో యువకుడిపై దాడికి దిగింది.

ప్రాణభయంతో యువకుడు కేకలు వేయగా, పక్కన ఉన్న మరో వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో యువకుడు గాయాలతో బయటపడినట్టు సమాచారం.

ఈ వీడియోపై నెటిజన్లు విస్తృతంగా స్పందిస్తున్నారు. “చనువిచ్చింది కదా? అని పులితో ఆడుకుంటే వేటాడేస్తది!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, “పులిని దూరంగా ఉండి చూసుకోవచ్చు. ఫొటో దిగడమే సరిపోతుంది. కానీ ఆడుకోవాలని చూస్తే, ప్రమాదం తప్పదు” అంటూ హెచ్చరిస్తున్నారు.

ఈ ఘటన వన్యప్రాణుల పట్ల మానవుల ప్రవర్తనపై మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. తమ ప్రయోజనాల కోసం జంతువులను ఉక్కిరిబిక్కిరి చేయడం మానవత్వానికి విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….