*ఉమ్మడి ఖమ్మం అధికారుల సమీక్ష సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,స్త్రీ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్: మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ..*
పనితనాన్ని మెరుగుపరచడానికి సమీక్ష సమావేశం..
యుద్ధ ప్రాతిపదిక పైన అంగన్వాడి భవన నిర్మాణాలు పూర్తి చేయాలి…
దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లో.. పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయులు చేతుల్లో ఉంది..
ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు పాఠశాలలను గుర్తించి అంగన్వాడి కేంద్రాలను అందులోకి మార్చాలి…
త్వరలోనే అంగన్వాడి కేంద్రాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం…
అంగన్వాడి అధికారులు చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదు…
అధికారులను క్షేత్రస్థాయిలో పర్యటించాలి…
అంగన్వాడి అధికారులు జిల్లా ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి…
అంగన్వాడి కేంద్రాలలో ఏదైనా సమస్య ఉంటే అధికారులు దృష్టికి తీసుకురావాలి..
అంగన్వాడీ కేంద్రాలలో కాంట్రాక్టర్లు నాణ్యతలేని ఆహారాన్ని సరఫరా చేస్తే వెంటనే తిరస్కరించాలి….
పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా నాణ్యమైన ఆహారం మాత్రమే అందించాలి…
గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల అలనా పాలన చూసుకోవడం కోసం క్రష్ కేంద్రాల ఏర్పాటు…
వయోవృద్దుల సంక్షేమానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి…
ఆస్తులు తీసుకొని తల్లిదండ్రులను చూడని పిల్లలపై కేసులు నమోదు చేయాలి…
త్వరలోనే అంగన్వాడీ కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలు ప్రారంభం…
వేసవి సెలవులు అనంతరం అంగన్వాడీ కేంద్రాల ప్రారంభం సెల్ఫీ విత్ అంగన్వాడీ కార్యక్రమాలు చేపట్టాలి….
వికలాంగులకు విందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి..
వయోవృద్ధులకు టేక్ కేర్ సెంటర్లు ప్రారంభించాలి…
తప్పుడు సమాచారం పై వార్తలు రాస్తే కేసులు పెడతాం…
అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పిల్లల అభివృద్ధి తో పాటు దేశ అభివృద్ధికి తోడ్పడాలి..
..









