జూన్ 3 నుండి 13 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు – హాల్టికెట్లు అందుబాటులో
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్: రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 42,832 మంది విద్యార్థులు హాజరుకాబోతున్నారు. వారికి సంబంధించిన హాల్టికెట్లు ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ స్కూల్ లాగిన్ ద్వారా లేదా వ్యక్తిగత వివరాలతో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ పరీక్షల నిర్వహణ కోసం 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అన్ని కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.
విద్యార్థులు హాల్టికెట్లను పరీక్షలకు హాజరయ్యే ప్రతి రోజు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు..









