ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పాయం

జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పాయం
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ప్రజా భవన్‌లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరయోధుడు, నవ భారత నిర్మాణ శిల్పి నెహ్రూ దేశ ప్రజాస్వామ్యానికి, ప్రగతికి పునాది వేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన అందించిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. నెహ్రూ వంటి మహానుభావుల స్వాతంత్య్ర పోరాట చరిత్రను యువతకు పరిచయం చేయాలని, వారు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినకి నవీన్, మాజీ జెడ్పిటిసి బట్ట విజయ్ గాంధీ, మణుగూరు టౌన్ అధ్యక్షుడు శివ సైదులు, శివాలయం గుడి చైర్మన్ కూచిపూడి బాబు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్