11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
న్యూఢిల్లీ,ఆధాబ్ న్యూస్;
దేశంలోని 11 హైకోర్టులకు చెందిన మొత్తం 21 మంది న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో దక్షిణ భారతానికి చెందిన పలువురు ప్రముఖ న్యాయమూర్తులు కూడా ఉన్నారు.
కొలీజియం సిఫార్సుల ప్రకారం, మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయనున్నారు. కర్ణాటక హైకోర్టు నుంచి జస్టిస్ సుమలత, జస్టిస్ లలిత కన్నెగంటి లను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. అలాగే పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిషేక్ రెడ్డిని కూడా తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయనున్నారు.
ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం అనేక హైకోర్టులలో జడ్జిల ఖాళీలను పూరించేందుకు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Post Views: 29









