ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పినపాకలో హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం – ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

పినపాకలో హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం – ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు, ఆధాబ్ న్యూస్:
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరులోని ప్రజా భవన్‌లో హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై మండలాల వారీగా సమీక్షిస్తూ, గ్రౌండింగ్‌, బేస్‌మెంట్‌, మార్క్‌అవుట్‌, రీ-వెరిఫికేషన్‌ తదితర అంశాలపై అధికారులను ప్రశ్నించారు.

నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడానికి లబ్ధిదారులను ప్రోత్సహించాలని, తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణ విధానం గురించి వారికి అవగాహన కల్పించాలన్నారు. నిర్మాణ దశల ప్రకారం వివరాలను ఆన్‌లైన్ యాప్‌లో నమోదు చేయాలని, ప్రభుత్వం అందించే సహాయం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్