సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో!
సికింద్రాబాద్,ఆధాబ్ న్యూస్: సికింద్రాబాద్ నుండి దేశ రాజధాని ఢిల్లీకి నడిచే వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో ప్రారంభం కానుంది. ఈ కొత్త స్లీపర్ ఎక్స్‌ప్రెస్ కోసం రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. మొత్తం 1667 కి.మీ దూరాన్ని ఈ రైలు ఒక్క రోజులోనే పూర్తిచేయనుంది.
ఢిల్లీ నుండి సాయంత్రం 8.50కి బయలుదేరే ఈ రైలు, తదుపరి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ప్రయాణంలో ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సి, నాగ్పూర్, బల్లార్ష, కాజీపేట స్టేషన్లలో రైలు ఆగనుంది.
కెబిన్ ధరల విషయానికి వస్తే, థర్డ్ ఏసీ టికెట్ రూ.3600, సెకండ్ ఏసీ రూ.4800, ఫస్ట్ ఏసీ రూ.6000 వరకు ఉండొచ్చని అంచనా. వేగవంతమైన, సౌకర్యవంతమైన నూతన ప్రయాణ అనుభవాన్ని ఈ వందే భారత్ స్లీపర్ అందించనుంది.
Post Views: 31









