ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  పడకేసిన పారిశుద్ధ్యం కరకగూడెం మండలంలో ప్రజలు ఇబ్బందులు:

నిధులు కేటాయించాలని టిడిపి నాయకుడు చందా మధు డిమాండ్.
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో పారిశుద్ధ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఎక్కడ చెత్త ఉంటే అక్కడే డంపింగ్ యార్డులుగా మారిపోయాయి. గతంలో గ్రామపంచాయతీ సర్పంచుల పదవీకాలంలో ఇంటింటికీ ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించడం జరుగుతుండగా, ప్రస్తుతం సర్పంచ్ పదవి కాలం ముగిసిన కారణంగా పారిశుధ్యం పూర్తిగా అదుపుతప్పింది.

గ్రామస్తులే ఇప్పుడు స్వయంగా చెత్తను తొలగించుకునే పరిస్థితి ఏర్పడింది. అధికారులు మరియు ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రజల సమస్యలు ముదిరిపోయాయి. ప్రధానంగా వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున, శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో పినపాక నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకుడు చందా మధు స్పందించారు. ప్రతి గ్రామపంచాయతీకి తగిన నిధులు కేటాయించి, కరెంట్ బల్బులు, బ్లీచింగ్ పౌడర్ వంటి అవసరాలను తీర్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పారిశుద్ధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే, ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి ఏర్పడుతుందన్న హెచ్చరికను ఆయన ఇచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….