ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ ఎసిబీకి చిక్కిన అరుణ – లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ ఎసిబీకి చిక్కిన అరుణ – లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు
ఖమ్మం, ఆధాబ్ న్యూస్:
ఖమ్మం జిల్లా రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ అరుణను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పుచ్చకాయల వెంకటేశ్వరరావు అనే డాకుమెంట్ రైటర్ ద్వారా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.50,000 లంచం డిమాండ్ చేసినట్టు ACB వెల్లడించింది. చర్చల అనంతరం రూ.30,000 వద్ద అంగీకారం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ నేపధ్యంలో, లంచం తీసుకుంటుండగా అధికారులు అరుణను పట్టుకొని కార్యాలయంలో సోదాలు జరిపారు. ఈ దాడులను ACB డిఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!