ఎమ్మెల్యే పాయంను కలిసిన పినపాక నూతన తహసీల్దార్
మణుగూరు, ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో, పినపాక తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన జి. గోపాలకృష్ణను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పూల గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తహసీల్దార్‌ను అభినందించారు. ప్రజల సంక్షేమం కోసం పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు..
Post Views: 83









