ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఐ రాజ్‌కుమార్:

సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఐ రాజ్‌కుమార్:
పినపాక,ఆధాబ్ న్యూస్: ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కొందరు నేరగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏడూల్ల బయ్యారం ఎస్‌ఐ రాజ్‌కుమార్ సూచించారు. బుధవారం పినపాక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో నిర్వహించిన ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన సైబర్ నేరాలు, పోక్సో (POCSO) చట్టం, ఇంటర్నెట్ వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఉపాధ్యాయులకు విస్తృతంగా సమాచారం అందించారు. మోసపూరిత మెసేజులు, లింకులు, అనుమానాస్పద కాల్స్‌కి భయపడకుండా స్పందించకుండా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పినపాక, కరకగూడెం మండల విద్యాశాఖ అధికారులు కొమరం నాగయ్య, జి. మంజుల, రెండు మండలాల రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్