ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పినపాక ఎమ్మెల్యే, కలెక్టర్ రాజుపేటలో పర్యటన – ప్రజా సమస్యలపై హామీ

పినపాక ఎమ్మెల్యే, కలెక్టర్ రాజుపేటలో పర్యటన – ప్రజా సమస్యలపై హామీ

మణుగూరు,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజుపేట పరిసర ప్రాంతాలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ సోమవారం పరిశీలించారు. మణుగూరు మండలంలోని రాజుపేట గ్రామంలో పలు ప్రాంతాలను వారు సందర్శించి స్థానిక పరిస్థితులను సమీక్షించారు.

ఈ సందర్భంగా వారు రాజుపేట, విట్టల్ రావు నగర్ ప్రాంతాల్లోని చెరువులను పరిశీలించడంతో పాటు, సింగరేణి బ్లాస్టింగ్ కారణంగా చీలిన ఇళ్లను కూడా పరిశీలించారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యే, కలెక్టర్‌కు తమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా సింగరేణి బొగ్గు టిప్పర్లు, ఇసుక టిప్పర్లు, డంపింగ్ నుంచి వస్తున్న ధూళి కారణంగా తమ ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని, నివాస ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు తెలిపారు.

ఈ సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ వి పాటేల్ తక్షణమే పరిష్కార చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సింగరేణి అధికారులు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, మణుగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినకి నవీన్, నియోజకవర్గ యువ కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ సైదులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్