ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరు వంద పడకల హాస్పిటల్‌లో ఎమ్మెల్యే, కలెక్టర్ సందర్శన – రివ్యూ మీటింగ్ నిర్వహణ

మణుగూరు వంద పడకల హాస్పిటల్‌లో ఎమ్మెల్యే, కలెక్టర్ సందర్శన – రివ్యూ మీటింగ్ నిర్వహణ
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
పేషెంట్లకు మెరుగైన సేవలే లక్ష్యం, నిర్లక్ష్యం సహించబోము – ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ పటేల్
మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని
పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్
సందర్శించి, హాస్పిటల్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.

డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించి,
పేషెంట్లకు మరింత మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో
సూచనలు చేశారు.

రోజువారీ OP సంఖ్య 500కి పైగా పెరగడం గమనార్హం అని,
ప్రజల్లో ఆసుపత్రిపై నమ్మకం పెరిగిందన్నారు.

57 మంది గర్భిణీ స్త్రీలు నార్మల్ డెలివరీలు చేసి తల్లి-బిడ్డల్ని క్షేమంగా పొందిన
ఈ ఘట్టం హాస్పిటల్‌కు మంచి గుర్తింపు తెచ్చిందని పేర్కొన్నారు.

శానిటేషన్ కార్మికులు ఆసుపత్రిని తమ ఇంటిలా చూసుకోవాలని,
ప్రతిక్షణం శుభ్రత పాటించాలని సూచించారు.

సిబ్బంది పేషెంట్లతో శ్రద్ధగా, సహానుభూతితో ప్రవర్తించాలని,
నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు.

హాస్పిటల్‌కు సంబంధించిన ఏవైనా సమస్యలు తక్షణమే తన దృష్టికి తేవాలని
ఎమ్మెల్యే తెలిపారు. వాటి పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

పాల్గిన ప్రముఖులు:

డీఎంహెచ్‌ఓ ఎస్. రవి బాబు

హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. సునీల్

మణుగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినకి నవీన్

టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ సైదులు

యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి

ఇతర యువజన నాయకులు, కార్యకర్తలు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!