ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాద్రి రామయ్య చెంతకు 8 లైన్ హైవే రోడ్డు ఖమ్మం జిల్లాలో భారీ రహదారి ప్రాజెక్ట్‌కు పునాది

భద్రాద్రి రామయ్య చెంతకు 8 లైన్ హైవే రోడ్డు
ఖమ్మం జిల్లాలో భారీ రహదారి ప్రాజెక్ట్‌కు పునాది
ఖమ్మం ,ఆధాబ్ న్యూస్ :
ఖమ్మం జిల్లాలో రవాణా రంగానికి భారీ బూస్ట్‌గా నిలవనున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తల్లాడ నుంచి భద్రాచలం వరకు 8 లైన్లతో కూడిన జాతీయ రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,606 కోట్లు కేటాయించింది.
ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకు ప్రయాణ సౌలభ్యం కల్పించడంతో పాటు, అభివృద్ధికి నూతన దిక్సూచి కానుంది. తల్లాడ నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి భద్రాచలం గుండా ములుగు, భూపాలపల్లి వరకు విస్తరించనుంది.

ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రతిపాదనలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద శ్రీరాముడి ఆలయాన్ని దర్శించుకునే భక్తులకు ఇది మరింత సౌకర్యంగా మారనుంది.

పరిశీలన, భూ సేకరణ, పర్యావరణ అనుమతుల వంటి అంశాల్లో వేగంగా చర్యలు తీసుకుంటూ, ఈ ప్రాజెక్టును త్వరితగతిన ప్రారంభించేందుకు యత్నాలు జరుగుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్