తాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భక్తుల మృతి
ములుగు ఆధాబ్ న్యూస్:
ములుగు జిల్లా తాడ్వాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడారం జాతర నుంచి తిరిగి వస్తున్న భక్తులతో నిండిన ట్రాక్టర్‌ను ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
వీరిలో ఆరు మంది పరిస్థితి విషమంగా ఉండగా, క్షతగాత్రులను అత్యవసర చికిత్స కోసం ములుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు అశ్వాపురం మండలానికి చెందినవారని గుర్తించామని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదం తాడ్వాయి అడవి ప్రాంతంలో చోటుచేసుకుంది. భక్తులు త్రాగునీటి కోసం ట్రాక్టర్‌ను అరణ్యంలో ఆపడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Post Views: 191









