ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  భద్రాచలంలో RTOకు వినతి పత్రం సమర్పించిన సామాజిక సేవకులు కర్నే బాబురావు

ప్రమాదాల నివారణకు ఖాకీ యూనిఫామ్, డ్రైవర్లకు చట్టబద్ధ హక్కులు కోరుతూ వినతి
భద్రాద్రి కొత్తగూడెం ,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో విద్యార్థులను పరిమితికి మించి ఎక్కించకుండా చర్యలు తీసుకోవాలని, డ్రైవర్లకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని కోరుతూ సామాజిక సేవకులు కర్నే బాబురావు జిల్లా రవాణా శాఖ అధికారి సంగం వెంకట పుల్లయ్యకు వినతిపత్రాన్ని అందజేశారు.

భద్రాచలంలోని ఆర్టీవో కార్యాలయంలో కలసిన బాబురావు, పుల్లయ్యకు శాలువా కప్పి సత్కరించి తమ అభినందనలు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాలోని అనేక ప్రైవేట్ స్కూల్ బస్సులు నియమాలను అతిక్రమించి విద్యార్థులను అధిక సంఖ్యలో తీసుకుపోతున్నారని, ఇది ప్రమాదాలకు కారణమవుతోందని పేర్కొన్నారు.

బస్సుల ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ తదితరాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్సులు నడుస్తున్నాయో లేదో తనిఖీలు జరపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, డ్రైవర్లకు సరైన శిక్షణ, డ్రైవింగ్ స్కిల్స్, చట్టబద్ధమైన లైసెన్స్ ఉన్నవారినే నియమించాలని సూచించారు.

సెల్‌ఫోన్ వాడకంతో కూడిన రాష్ డ్రైవింగ్‌ని నిరోధించాల్సిన అవసరం ఉందని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని బాబురావు తెలిపారు. ప్రతి డ్రైవరుకు రెండు జతల ఖాకీ యూనిఫాంలు, బూట్లు ఇవ్వాలని, డ్రైవర్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాలను ఆదేశించాలని ఆయన కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….