ప్రతి క్షణం
ప్రజల పక్షం

  దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా

భద్రాద్రి కొత్తగూడెం, మే 16: ఆధాబ్ న్యూస్:
ఈనెల 20న జరగవలసిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జూలై 9కి వాయిదా వేస్తున్నట్టు అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రకటించాయి. శుక్రవారం సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ఆర్. మధుసూదన్ రెడ్డి (TUCI), జి. వెంకటేశ్వర్లు (AITUC), జి. శ్రీనివాస్ (CITU), పి. భద్రం (INTUC), నాగెల్లి వెంకట్ (TBGKS), వరదల సమ్మయ్య (CKHPS) మాట్లాడారు.

వారికీ ప్రకారం, ఇండియా–పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈనెల 20న జరగవలసిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసి, జూలై 9కి మార్చినట్టు తెలిపారు.

ఈ మార్పును కార్మిక వర్గం అర్థం చేసుకొని, జూలై 9న జరిగే సమ్మెకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని వారు కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్