కిరాణా దుకాణంలో నాటు సారా పట్టివేత
పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలోని పొట్లపల్లి గ్రామంలో నాటు సారా విక్రయాన్ని ఎస్సై రాజ్‌కుమార్ గురువారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు గ్రామంలోని ఓ కిరాణా దుకాణంలో నాటు సారా అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. దాడిలో 7 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై సంబంధిత దుకాణదారుడిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. నాటు సారా విక్రయించే వారి గురించి సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇవ్వడంలో వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.
Post Views: 102









