ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  సీపీఐ కృషితో జానంపేటకు మళ్లీ ‘108’ అంబులెన్స్ – సీపీఐ మండల కార్యదర్శి తోగటి కుమార్

 

సీపీఐ కృషితో జానంపేటకు మళ్లీ ‘108’ అంబులెన్స్

– సీపీఐ మండల కార్యదర్శి తోగటి కుమార్

పినపాక, జూలై 2 (ఆధాబ్ న్యూస్): జానంపేట, పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు గతంలో కేటాయించిన ‘108’ అంబులెన్స్‌ను మణుగూరుకు తరలించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీపీఐ మండల కార్యదర్శి తోగటి కుమార్ తెలిపారు. ఈ సమస్యపై సీపీఐ నిరంతరంగా చేపట్టిన పోరాటాలు ఫలించి, ‘108’ అంబులెన్స్‌ను తిరిగి జానంపేటకు కేటాయించినట్లు ఆయన హర్షం వ్యక్తం చేశారు.

జానంపేట నుంచి తరలించిన ‘108’ అంబులెన్స్‌ను తిరిగి ఇక్కడికే రప్పించాలని సీపీఐ ఆధ్వర్యంలో పలు ఆందోళనలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఈ విషయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ప్రత్యేక చొరవ తీసుకుని డీఎంహెచ్‌ఓ, జిల్లా కలెక్టర్‌లతో మాట్లాడి జానంపేట ప్రజల సమస్యలను వివరించి, అంబులెన్స్‌ను పునరుద్ధరించాలని కోరినట్లు చెప్పారు.

నాయకుల చొరవ, సీపీఐ శ్రేణుల నిరంతర కృషి ఫలితంగా గురువారం జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్‌సీ) తిరిగి ‘108’ అంబులెన్స్‌ను కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని తోగటి కుమార్ తెలిపారు.

జానంపేట, పరిసర గ్రామాల ప్రజల తరఫున ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సాబీర్ పాషా, జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….