ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సిరిసిల్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సిరిసిల్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
రాజన్న సిరిసిల్ల , ఆధాబ్ న్యూస్:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్లలో ఇరిగేషన్ విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అర్రం రెడ్డి అమరేందర్ రెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కరీంనగర్‌లోని తన నివాసంలో రూ.60,000 లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల ప్రకారం, రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ మండలం అవునూరు మరియు అగ్రారాం గ్రామాల మధ్య చెక్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి రూ.50 లక్షల విలువైన కాంట్రాక్ట్ బిల్‌ను మంజూరు చేయాలంటే లంచంగా డిమాండ్ చేసినట్లు సమాచారం. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు ఉంచిన ఉగ్రాపథంలో ఆయనను పట్టుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్